Ganesh Acharya: అశ్లీల వీడియోలు చూడాలని బలవంతం చేశాడు: కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై మహిళ ఫిర్యాదు

  • శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు
  • నా ఆదాయంలో కమిషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడు
  • మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసిన మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్
ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్, నేషనల్ అవార్డ్ విన్నర్ గణేశ్ ఆచార్యపై ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని... అశ్లీల వీడియోలు చూడాలని బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. ఈ మేరకు మహారాష్ట్ర మహిళా కమిషన్ తోపాటు, ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనకు వచ్చే ఆదాయంలో కమిషన్ ఇవ్వాలని కూడా ఒత్తిడి చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. గణేశ్ ఆచార్యపై గతంలో సినీ నటి తనుశ్రీ దత్తా కూడా ఆరోపణలు చేసింది. మరోవైపు, సదరు మహిళ చేసిన ఆరోపణలపై గణేశ్ ఆచార్య స్పందించాల్సి ఉంది.
Ganesh Acharya
Sexual Assault
Bollywood

More Telugu News