Congress: యువత దేశ సంపద.. దీన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది: రాహుల్ గాంధీ

  • దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని మోదీకి అవగాహన లేదు
  • భారత  ప్రతిష్ఠను మోదీ సర్కారు దెబ్బతీస్తోంది
  • దేశంలోకి వచ్చే పెట్టుబడులు నిలిచిపోయాయి

దేశంలో ప్రస్తుతం ఆర్థిక వృద్ధిరేటు యూపీయే పాలనలో నమోదైన దానికంటే తక్కువగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లో జరిగిన ‘యువ ఆక్రోశ్ ర్యాలీ’లో రాహుల్ పాల్గొన్నారు. ఈ ర్యాలీలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తదితరులు కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ..మోదీ సర్కార్ పాలన తీరుపై ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి దేశ ఆర్థిక వ్యవస్థపై సరైన అవగాహన లేదని వ్యాఖ్యానించారు. యువత దేశ సంపద అనీ, అయితే, ప్రస్తుతం ఆ సంపదను సర్కారు దుర్వినియోగం చేస్తోందని రాహుల్ విమర్శించారు.

రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. తమ విధానాలతో పరిస్థితిని దిగజార్చిందన్నారు. గత ఏడాది కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు. ఇప్పటివరకు భారత్ శాంతికాముక దేశంగా పేరు గడించిందని.. ఆ పేరు ప్రతిష్ఠలను మోదీ సర్కారు దెబ్బతీస్తోందని ఆరోపించారు. ఫలితంగా దేశంలోకి వచ్చే పెట్టుబడులు నిలిచిపోయాయని అన్నారు. 

  • Loading...

More Telugu News