Nara Lokesh: 8 నెలల్లోనే పరాజితుడిగా మిగిలిపోయాడు: నారా లోకేశ్
- అన్ని రకాలుగా జగన్ వైఫల్యం చెందారు
- ఆయన నుంచి ఇంతకు మించి ఎవరూ ఏమీ ఆశించలేరు
- ట్విట్టర్ ద్వారా జగన్ పై లోకేశ్ విమర్శలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనా తీరుపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. పాలనలో అన్ని రకాలుగా జగన్ వైఫల్యం చెందారని విమర్శించారు. జగన్ గెలిచి 8 నెలలు అవుతోందని... ఇప్పటికే ఆయన ఒక పరాజితుడిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. జగన్ నుంచి ఎవరూ ఇంతకు మించి ఏమీ ఆశించలేరని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
దీంతోపాటు, అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ చేసుకుందంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన కథనాన్ని లోకేశ్ షేర్ చేశారు. రాజధాని అమరావతి ఆగిపోవడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైన నేపథ్యంలో... హైదరాబాద్ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కబోతోందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ అభిప్రాయపడింది.