CM Ramesh: తన కుమారుడి పెళ్లికి రావాల్సిందిగా సీఎం జగన్ ను ఆహ్వానించిన సీఎం రమేశ్!

  • ఫిబ్రవరి 7న సీఎం రమేశ్ తనయుడి వివాహం
  • శుభలేఖలు పంచుతున్న సీఎం రమేశ్
  • తాజాగా జగన్ తో భేటీ
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సీఎం రమేశ్ తనయుడు రిత్విక్ వివాహం ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కుమార్తె పూజతో ఫిబ్రవరి 7న జరగనుంది. ఇటీవలే దుబాయ్ లో వీరి నిశ్చితార్థం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో కొన్నిరోజుల నుంచి సీఎం రమేశ్ ప్రముఖులకు శుభలేఖలు అందిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. తన కుమారుడు రిత్విక్ పెళ్లికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సీఎం రమేశ్ ఆహ్వానానికి జగన్ నుంచి సానుకూల స్పందన వ్యక్తమైనట్టు తెలుస్తోంది. అటు, టీడీపీ అధినేత చంద్రబాబును కూడా సీఎం రమేశ్ ఈ పెళ్లికి ఆహ్వానించనున్నారు.
CM Ramesh
Jagan
Rithwik
Wedding
Pooja
BJP
YSRCP
Chandrababu

More Telugu News