Crime News: న్యాయమూర్తికి అనారోగ్యం.. సమత అత్యాచారం కేసులో తీర్పు ఈ నెల 30కి వాయిదా

  • ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసు
  • ఈ రోజు తీర్పు వెల్లడి కావాల్సి ఉండగా వాయిదా
  • ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఇప్పటికే ముగిసిన విచారణ
కొమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో జరిగిన సమత అత్యాచారం కేసులో ఈ రోజు తీర్పు వెల్లడి కావాల్సి ఉండగా వాయిదా పడింది. న్యాయమూర్తి అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నారని, దీంతో తీర్పును ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.

లింగాపూర్ మండలం ఎల్లపట్టార్ గ్రామంలో సమత హత్యాచారం ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే ఆమెను ముగ్గురు వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ఇప్పటికే విచారణ పూర్తయింది.
 
కాగా, హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో విచారణను కూడా వచ్చేనెల 6కు వాయిదా వేశారు. ముగ్గురు బాలికలపై నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి  క్రూరంగా అత్యాచారం చేసి పాడుబడిన బావిలో మృతదేహాలను పూడ్చి పెట్టినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో కోర్టులో 300మంది సాక్షులను విచారించారు. శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్షను విధించేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బలమైన సాక్ష్యాలను సమర్పించినట్లు తెలిసింది.
Crime News
Kumaram Bheem Asifabad District

More Telugu News