Jagan: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను కొని జగన్ గారు ఫొటోలకు పోజులిచ్చారు: బుద్ధా వెంకన్న

  • 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నామంటూ బీరాలు పలికారు
  • 8 నెలలు పూర్తికాక ముందే సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొన్నారు
  • మండలి సాక్షిగానూ బేరసారాలను మొదలుపెట్టారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. '151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నామంటూ బీరాలు పలికి 8 నెలలు పూర్తికాక ముందే సంతలో పశువుల్లా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను కొని, జగన్ గారు ఫొటోలకు పోజులిచ్చారు' అని అన్నారు.

'మూడు ముక్కలాట ఆడబోయి మండలిలో బొక్క బోర్లా పడుతున్నాం అని పసిగట్టి ఏ2 విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపి మండలి సాక్షిగా బేరసారాలు మొదలుపెట్టారు. మండలి గ్యాలరీలో కూర్చొని ఏ2 తో హార్స్ ట్రేడింగ్ చేయించాడు' అని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

'ఇద్దరు ఎమ్మెల్సీలను కొనుక్కొని వైకాపా కండువా కప్పే దుస్థితికి జగన్ దిగజారిపోయాడు అంటేనే అతని పాలన ఎంత అద్వానంగా ఉందో అర్థమవుతుంది.151 స్థానాలు గెలిచిన వ్యక్తిని ఇద్దరు ఎమ్మెల్సీలను కొనే నీచ స్థాయికి తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుంది విజయసాయి రెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
Jagan
YSRCP
Telugudesam
budda venkanna

More Telugu News