KPHB: స్పా ముసుగులో వ్యభిచారం... ఆన్ లైన్ ద్వారా కస్టమర్లకు వల.. హైదరాబాద్ లో నలుగురి అరెస్ట్!

  • కేపీహెచ్బీ లో యూనివర్సల్ స్పా
  • గుట్టుగా జరుగుతున్న దందా
  • పక్కా సమాచారంతో పోలీసుల దాడి
హెయిర్ సెలూన్ అండ్ స్పా పేరిట వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ యువతితో పాటు మరో ముగ్గురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఎస్వోటీ విభాగం అధికారులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే, కూకట్ పల్లి ప్రాంతానికి చెందిన ఆరిపాక కృష్ణ, మరో యువతి, కేపీహెచ్బీలో ఓ ఫ్లాట్ ను అద్దెకు తీసుకుని యూనివర్సల్ హెయిర్ అండ్ స్పా సెంటర్ ను ప్రారంభించారు.

జస్ట్ డయల్, సులేఖ తదితర ఆన్ లైన్ యాప్ల ద్వారా కస్టమర్లను ఆకర్షించి, వారికి సోషల్ మీడియాలో ఫోటోలను పంపి, కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని దందాను సాగిస్తున్నారు. ఈ విషయమై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు, దాడి చేయగా, కృష్ణ, ఓ యువతి, మరో ఇద్దరు విటులు పట్టుబడ్డారు. వారి నుంచి 6 సెల్ ఫోన్లు, రూ. 1.36 లక్షలకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. యువతిని రెస్క్యూ కేంద్రానికి తరలించామని, నిందితులను కోర్టు ముందు హాజరు పరిచామని అన్నారు.
KPHB
Universal Spa
Police
Prostitution
Arrest
Hyderabad

More Telugu News