Cobe Briyant: క్రీడా ప్రపంచంలో విషాదం... హెలికాప్టర్ ప్రమాదంలో కూతురు సహా బాస్కెట్ బాల్ లెజండ్ కోబ్ బ్రియాంట్ దుర్మరణం!

  • లాస్ ఏంజిల్స్ సమీపంలో ప్రమాదం
  • కూలుతూనే మండిపోయిన హెలికాప్టర్
  • తీవ్ర విచారం వెలిబుచ్చిన ఎన్బీఏ
క్రీడా ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బాస్కెట్ బాల్  లెజండ్ గా పేరు తెచ్చుకున్న కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ఆయన కూతురు సహా తొమ్మిది మంది మరణించారు. అమెరికన్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ - ఎన్బీఏ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరిగా కోబ్ గుర్తింపు తెచ్చుకున్నారు.

కోబ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాస్ ఏంజిల్స్ కు అతి సమీపంలో అదుపుతప్పి కుప్పకూలింది. నగర శివార్లలోని నిర్జన ప్రదేశంలో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ మొత్తం కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. హెలికాప్టర్ లోని మృతదేహాలన్నీ గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి.

'బ్లాక్ మాంబా'గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో సుప్రసిద్ధుడైన కోబ్, దాదాపు 20 సంవత్సరాలకు పైగా క్రీడాభిమానులను అలరించారు. చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన టాప్-3 ప్లేయర్లలోనూ చోటు దక్కించుకున్నారు. ఆయన వయసు 41 సంవత్సరాలు. కోబ్ మృతిపట్ల ఎన్బీఏ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది.
Cobe Briyant
Basket Ball
Helecopter
Accident

More Telugu News