Iran: యూఎస్ ఎంబసీ టార్గెట్ గా ఇరాక్ లో మళ్లీ రాకెట్ దాడులు!

  • మరోసారి అట్టుడికిన ఇరాక్
  • యూఎస్ ఎంబసీ ప్రహరీగోడ సమీపంలో పడ్డ ఐదు రాకెట్లు
  • అధికారికంగా ధ్రువీకరించని ఇరాక్, అమెరికా
ఇరాక్ మరోసారి అట్టుడికింది. రాజధాని బాగ్దాద్ లోని హై సెక్యూరిటీ జోన్ లో ఉన్న యూఎస్ ఎంబసీ లక్ష్యంగా ఆదివారం రాత్రి రాకెట్ దాడులు జరిగాయి. ఈ రాకెట్ దాడుల విషయాన్ని పలు ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు వెల్లడించాయి. అమెరికా రాయబార కార్యాలయం ప్రహరీ గోడకు సమీపంలోనే ఐదు రాకెట్లు పడ్డాయని తెలుస్తుండగా, దీనిపై అమెరికా గానీ, ఇరాక్ గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇటీవల ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీమ్ సులేమానీని అమెరికా సైన్యం హతమార్చిన అనంతరం మొదలైన ప్రతీకార దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
Iran
Iraq
USA
Embassy
Rocket Attack

More Telugu News