YSRCP: తప్పుడు ఫోన్ కాల్స్ తో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోంది: సత్యనారాయణరాజు

  • మడకశిర టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు
  • తప్పుడు ఫోన్ కాల్స్ అంటూ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు ఆగ్రహం
  • ఆ ఫోన్ కాల్స్ తో టీడీపీకి సంబంధం లేదని స్పష్టీకరణ
తప్పుడు ఫోన్ కాల్స్ తో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు ఆరోపించారు. మడకశిర నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలకు ఫోన్లు చేశారని, తప్పుడు ఫోన్ కాల్స్ తో కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు వచ్చిన ఫోన్ కాల్స్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ఫోన్ కాల్స్ ను టీడీపీ కార్యకర్తలెవరూ నమ్మవద్దని తెలిపారు.
YSRCP
Phone Calls
Fake
Mind Game
Sathyanarayana Raju
Telugudesam

More Telugu News