China: చైనాలో ఏ భారతీయుడికి కరోనా వైరస్ సోకలేదు: విదేశాంగ శాఖ

  • చైనాలో కోరలు చాచుతున్న కరోనా వైరస్
  • ఇప్పటివరకు 56 మంది మృతి
  • 2,008కి వైరస్ సోకినట్టు నిర్ధారణ

చైనాలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న తరుణంలో విదేశీయులు అక్కడికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. చైనాలో భారతీయులెవరికీ కరోనా వైరస్ సోకలేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. బీజింగ్ లోని భారత దౌత్య కార్యాలయం చైనాలో ఉన్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వివరించింది. వుహాన్, హ్యుబేయ్ ప్రావిన్స్ లో ఉన్న భారత విద్యార్థులతోనూ దౌత్య సిబ్బంది టచ్ లో ఉన్నారని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

చైనాలో గత డిసెంబరులో తొలి కరోనా వైరస్ కేసు వుహాన్ లో బయటపడింది. ప్రస్తుతం వుహాన్ నగరంలో ఉన్న 11 మిలియన్ల మంది ప్రజలను నగరం వరకే పరిమితం చేశారు. వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు మరింతగా విస్తరించే ప్రమాదం ఉందని చైనా ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చైనాలో 56 మంది చనిపోగా, బాధితుల సంఖ్య 2,008 వరకు ఉన్నట్టు గుర్తించారు.

More Telugu News