Sivaswami: మాకు రాజకీయాలతో సంబంధం లేదు... అమరావతి రాజధాని దైవ సంకల్పం: శివస్వామి

  • అమరావతిలో మహా కాలభైరవ యాగం
  • యాగం నిర్వహించిన శివస్వామి
  • మోదీ శంకుస్థాపన చేసినప్పుడే ఆంధ్రుల రాజధాని అయిందని వ్యాఖ్యలు
ఏపీ రాజధాని అమరావతి కొనసాగింపు కోసం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి మహా కాలభైరవ యాగం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉద్ధండరాయుని పాలెంలో నిర్వహించిన ఈ యాగం ఈ సాయంత్రం ముగిసింది. ఈ సందర్భంగా శివస్వామి మాట్లాడుతూ, తమకు రాజకీయాలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేసినప్పుడే అమరావతి రాజధాని అయిందని, అమరావతి రాజధాని అనేది దైవసంకల్పం అని స్పష్టం చేశారు. అమరావతి కోసం తమ వంతు కృషి చేస్తామని శివస్వామి తెలిపారు. త్వరలో తిరుపతిలో లక్షమందితో మహాసభ నిర్వహిస్తామని చెప్పారు.
Sivaswami
Amaravati
AP Capital
Andhra Pradesh
Narendra Modi

More Telugu News