ఈ ఆలయంలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలే ప్రసాదాలు.. ఇంటికి పార్శిల్ కూడా తీసుకెళ్లొచ్చు!
- మధురై మునియాండి స్వామి ఆలయంలో బిర్యానీ ప్రసాదం
- ఏడాదికి రెండ్రోజులు ఉత్సవాలు
- వందల సంఖ్యలో మేకలు, కోళ్లతో బిర్యానీలు
ప్రతి సంవత్సరం ఇక్కడ జనవరి 24 నుంచి రెండ్రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు మునియాండి ఆలయానికి వస్తారు. వారి కోసం 1000 కిలోల బియ్యం, 250 మేకపోతులు, 300 కోళ్లతో రుచికరమైన బిర్యానీలు వండుతారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు ఇదే ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు, ఆ బిర్యానీ ప్రసాదాన్ని పార్శిల్ కట్టించుకుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయం కూడా ఉందిక్కడ!