ఏపీ శాసనమండలి చైర్మన్ తో గవర్నర్ భేటీ

26-01-2020 Sun 14:26
  • ఏపీలో కీలక పరిణామం
  • శాసనసభ, మండలిలో ఇటీవలి పరిణామాలపై ఆరా
  • గవర్నర్ కు వివరించి చెప్పిన షరీఫ్  
ఏపీలో ప్రస్తుత రాజకీయాలు హాట్ గా ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలి చైర్మన్ షరీఫ్ తో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ భేటీ అయ్యారు. రెండు బిల్లుల రద్దు వ్యవహారంపై శాసనసభ, మండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ ఆరా తీసినట్టు సమాచారం. కౌన్సిల్ లో జరిగిన పరిణామాల గురించి గవర్నర్ కు షరీఫ్ లు వివరించినట్టు తెలుస్తోంది. కాగా, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో గవర్నర్ నిన్న భేటీ అయ్యారు. ఇదే అంశంపై వివరాలు అడిగి ఆయన తెలుసుకున్నారు.