Republic Day: రిపబ్లిక్‌ డే వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

  • జాతీయ జెండా ఆవిష్కరించి వందనం
  • పార్టీ కార్యాలయంలో పాల్గొన్న టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ
  • ప్రజా చైతన్యానికి పిలుపు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లోని తన స్వగృహంలో జరిగిన రిపబ్లిక్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉండడంతో కార్యక్రమాన్ని తన ఇంటి మేడపై నిర్వహించారు. గాంధీ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. అలాగే హైదరాబాద్‌లోని టీడీపీ కార్యాలయంలో పార్టీ టీటీడీపీ అధ్యక్షుడు జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రతిభావంతులను, ప్రజల శ్రేయస్సును కోరే వారిని రాజకీయాల్లోకి తెచ్చారన్నారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో విరుద్ధమైన పాలన సాగుతోందని విమర్శించారు. నాయకులు ప్రజా జీవితాలతో ఆడుకుంటున్నారని, ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.
Republic Day
Chandrababu
Hyderabad
TTDP
l.ramana

More Telugu News