Mangalore: ఆదిత్యరావు బ్యాంకు లాకర్ లో బాంబులు, సైనైడ్!

  • గత వారం మంగళూరు ఎయిర్ పోర్టులో బాంబు
  • ఉడుపి కర్ణాటక బ్యాంకులో లాకర్
  • మరింత లోతుగా విచారిస్తున్న అధికారులు
గతవారంలో కర్ణాటకలోని మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బాంబు పెట్టి, దొరికిపోయిన ఆదిత్యరావు గురించిన కీలక విషయాలను విచారణలో భాగంగా పోలీసు అధికారులు వెలుగులోకి తెచ్చారు. కర్ణాటక బ్యాంకులో అతని పేరిట ఉన్న ఓ లాకర్ లో బాంబులను తయారు చేసేందుకు ఉపయోగించే పదార్థాలను, సైనైడ్ ను గుర్తించారు. ఉడుపిలోని బ్యాంకులో లాకర్ ను ఆదిత్యరావు తీసుకున్నాడని, అతన్ని మరింత లోతుగా విచారిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. బాంబు పెట్టేందుకు వచ్చిన వేళ, తనను ఎవరైనా పట్టుకుంటే, సైనైడ్ తీసుకునేందుకు ఆదిత్యరావు సిద్ధమయ్యాడని, అదే రోజున వడాంభండేశ్వర ఆలయానికి వెళ్లి పూజలు కూడా చేశాడని తెలిపారు. తదుపరి విచారణలో భాగంగా ప్రస్తుతం ఆదిత్యరావును ఉడుపిలో విచారిస్తున్నారు.
Mangalore
Airport
Bomb
Aditya Rao

More Telugu News