kashmir: కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి మేం రెడీ: నేపాల్ సంచలన ప్రకటన

  • కశ్మీర్ వివాదం తమ ద్వైపాక్షిక అంశమని ఇప్పటికే స్పష్టం చేసిన భారత్
  • అమెరికా విజ్ఞప్తినీ తోసిపుచ్చిన వైనం
  • నేపాల్ ప్రకటనకు ప్రాధాన్యం

కశ్మీర్ విషయంలో భారత్-పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి తాము రెడీ అనీ నేపాల్ సంచలన ప్రకటన చేసింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలను చర్చల ద్వారా మాత్రమే తొలగించుకోవచ్చని నేపాల్ ప్రభుత్వాధికారి ఒకరు పేర్కొన్నారు. దాయాదుల మధ్య పరిస్థితులు చక్కబడితే దక్షిణాసియా దేశాల సార్క్ కూటమి మరింత పునరుత్తేజితమవుతుందన్నారు.

కశ్మీర్ వివాదం భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని, ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని సహించబోమని భారత్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. మధ్యవర్తిత్వానికి అమెరికా ముందుకొచ్చినప్పటికీ సున్నితంగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో నేపాల్ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. నేపాల్ ప్రకటన వాస్తవమే అయితే, కశ్మీర్ అంశంపై మధ్య వర్తిత్వానికి ఆసక్తి చూపిన తొలి దక్షిణాసియా దేశంగా నేపాల్‌కు గుర్తింపు లభిస్తుంది.

More Telugu News