President Of India: లక్ష్యం కోసం పోరాడే సమయంలోనూ అహింసామార్గాన్ని అనుసరించాలి: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

  • ముఖ్యంగా యువత ఈ మార్గాన్ని అనుసరించాలి
  • సత్యం, అహింసలు నిత్య జీవితంలో భాగం కావాలి
  • గణతంత్ర రాజ్యాన్ని నడిపించేది ప్రజలే

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. లక్ష్యం కోసం పోరాడే సమయంలోనూ ప్రజలు అహింసా మార్గాన్ని అనుసరించాలని, ముఖ్యంగా యువత దీన్ని పాటించాలని సూచించారు. మానవాళికి ‘అహింస’ అనే కానుకను మహాత్ముడు అందించారని కొనియాడారు. గాంధీ పథంలోని సత్యం, అహింసలు నిత్య జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు.

గణతంత్ర రాజ్యాన్ని నడిపించేది ప్రజలేనని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం ఈ రెండూ కీలకపాత్ర పోషించాలని సూచించారు. మనిషి చేస్తోంది తప్పా? ఒప్పా అనే దానిపైనే ప్రజాస్వామ్యం పని తీరు ఆధారపడి ఉంటుందని అన్నారు. దేశ సంక్షేమమే ధ్యేయంగా ప్రజలు ముందుకు వెళ్లాలని సూచించిన రామ్ నాథ్ కోవింద్, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించారు.

More Telugu News