Visakhapatnam: పేదల ఇళ్ల స్థలాల కోసం విశాఖలో ల్యాండ్ పూలింగ్... విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం

  • అమరావతి తరహా ల్యాండ్ పూలింగ్
  • 10 మండలాల్లో 6,116.5 ఎకరాలు సేకరించాలని నిర్ణయం
  • అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజి

అమరావతి తరహా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని వైసీపీ సర్కారు విశాఖలోనూ అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేసింది. పేదల ఇళ్ల స్థలాల కోసం 10 మండలాల్లో 6,116.5 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్బవరం, పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, భీమిలి, అనకాపల్లి, విశాఖ రూరల్, పెద గంట్యాడ, ఆనందపురం ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలని భావిస్తున్నారు. అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజి రూపొందించారు.

భూములకు ఎకరాకు 900 గజాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. పదేళ్లకు పైగా ఆక్రమణలో ఉంటే 450 గజాలు, 5 నుంచి పదేళ్లలోపు ఆక్రమణలో ఉన్న భూమికి 250 గజాలు ఇస్తామని చెబుతోంది. ఇక, అభివృద్ధి చేసిన భూమిలో ఖర్చుల నిమిత్తం 15 శాతం వీఎంఆర్డీఏకి ఇవ్వాలని నిర్ణయించారు.

More Telugu News