Allu Arjun: బన్నీ .. సుకుమార్ మూవీ రిలీజ్ అప్పుడేనట!

  • కేరళ అడవుల్లో బన్నీ సినిమా 
  • త్వరలో జాయిన్ కానున్న బన్నీ 
  • సెప్టెంబర్లో విడుదల చేసే ఆలోచన

అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో మూడో సినిమా పట్టాలెక్కింది. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ షూటింగు కేరళలో జరిగింది. తదుపరి షెడ్యూల్ షూటింగులో బన్నీ జాయిన్ కానున్నాడు. 'శేషాచలం' అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. అందువలన పాత్ర పరంగా బన్నీ ఈ సినిమాలో చిత్తూరు యాసలో మాట్లాడతాడు. అయితే అడవి నేపథ్యంలోని పూర్తి సన్నివేశాలను కేరళ అడవుల్లో చిత్రీకరించనున్నారు.

లారీ డ్రైవర్ గా బన్నీ నటించే ఈ సినిమాలో ఆయన జోడీగా రష్మిక కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించే ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయాలనే నిర్ణయానికొచ్చారు. అక్టోబర్ 2వ తేదీన 'ఆర్ఆర్ఆర్'ను విడుదల చేసే అవకాశాలు వున్నాయి. అందువలన ముందు నెలలోనే బన్నీ - సుకుమార్ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. త్రివిక్రమ్ తో కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టిన బన్నీ, సుకుమార్ తో కూడా హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.

More Telugu News