Revanth Reddy: మంత్రి కేటీఆర్ కు ఎన్నికల అధికారులు నోటీసు ఎందుకు ఇవ్వలేదు?: రేవంత్ రెడ్డి

  • ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగుతుందని ప్రచారం చేశారు
  • కేటీఆర్ సహా హరీశ్, ఎర్రబెల్లి, మల్లారెడ్డిపై చర్యలేవి?
  • ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం దారుణం

తెలంగాణ మంత్రులపై టీ- కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అదే సమయంలో, రాష్ట్ర ఎన్నికల సంఘంపై ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేటీఆర్ యత్నించారని ఆరోపించారు. హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ లు మాట్లాడిన తీరు కూడా అదేవిధంగా ఉందని ఆరోపించారు. కేటీఆర్ సహా వీళ్లపై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నోటీసు ఇచ్చి వివరణ ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు.

తన ఓటు ఎవరికి వేశారో ఆ విషయాన్నిబహిరంగంగా ప్రకటించిన గంగుల కమలాకర్ పై ఇప్పటి వరకు క్రిమినల్ కేసును ఎన్నికల నిర్వహణ అధికారులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డి బేరసారాల విషయానికి సంబంధించి బయటకు వచ్చిన టెలిఫోన్ సంభాషణల ఆడియో టేప్ పై తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం కేసు పెట్టకపోవడం దారుణమైన విషయమని మండిపడ్డారు.

More Telugu News