Bharath: అలా సినిమాల్లో ఛాన్స్ వచ్చింది: నటుడు 'రెడీ' భరత్

  • నేను పుట్టిపెరిగింది చెన్నైలో 
  •  నా తొలి సీరియల్ 'మాతృదేవత'
  • 'పంచతంత్రం' సినిమా మొదట రిలీజ్ అయ్యిందన్న భరత్  
భరత్ అనే పేరు కొంతమందికే తెలుసు .. అయితే, 'రెడీ'లోని చిట్టినాయుడు అనగానే ఎవరైనా సరే వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆయన ఆ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలా బాల నటుడి నుంచి హీరోలతో సమానమైన స్నేహితుల పాత్రలు చేసే స్థాయికి ఆయన చేరుకున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను గురించి ప్రస్తావించాడు.

" నేను పుట్టి పెరిగింది చెన్నైలో .. మా నాన్నగారు తెలుగువారైనప్పటికీ, ఉద్యోగరీత్యా చెన్నైలో ఉండేవారు. అందువలన నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు. చిన్నప్పటి నుంచే నాకు నటన అంటే ఇష్టం. ఈటీవీ వారు నిర్మించిన 'మాతృదేవత' సీరియల్ ద్వారా బుల్లితెరకి పరిచయమయ్యాను. ఆ తరువాతనే సినిమాల్లో అవకాశాలు రావడం మొదలైంది. నేను చేసిన మూడో మూవీ 'పంచతంత్రం' .. అయితే ఈ సినిమానే ముందుగా విడుదలైంది" అని చెప్పుకొచ్చాడు.
Bharath
Ready Movie
Panchatantram Movie

More Telugu News