Allu Arjun: బోయపాటిని పరామర్శించిన అల్లు అర్జున్

  • ఇటీవల కన్నుమూసిన బోయపాటి తల్లి
  • పెదకాకానికి వెళ్లిన అల్లు అర్జున్
  • బోయపాటికి ధైర్యం చెప్పిన బన్నీ
ప్రముఖ టాలీవుడ్ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుని హీరో అల్లు అర్జున్ పరామర్శించాడు. బోయపాటి తల్లి సీతారావమ్మ అనారోగ్య కారణాలతో ఇటీవల తుది శ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో, గుంటూరు జిల్లా పెదకాకానికి వచ్చిన అల్లు అర్జున్ బోయపాటిని కలిసి ధైర్యం చెప్పాడు. అల్లు అర్జున్ మేనమాన ముత్తంశెట్టి రాజేంద్రప్రసాద్ ఇటీవలి మరణించిన సంగతి తెలిసిందే. అక్కడకు వెళ్లిన బన్నీ... అక్కడి నుంచి పెదకాకానిలోని బోయపాటి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించాడు. అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Allu Arjun
Boyapati Sreenu
Tollywood

More Telugu News