Corona Virus: ముంబయిలో ఇద్దరికి కరోనా వైరస్ ఛాయలు..?.. ప్రత్యేక వార్డుకు తరలింపు!

  • చైనా నుంచి ముంబయి వచ్చిన ఇద్దరు వ్యక్తులు
  • కరోనా వైరస్ బాధితులుగా భావిస్తున్న అధికారులు
  • ఎయిర్ పోర్టు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన అధికారులు
ఆసియా దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. చైనాలో మొదలైన ఈ మహమ్మారి అనేకమందిని బలిగొంది. తాజాగా ముంబయిలో కరోనా వైరస్ కలకలం రేగింది. చైనా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిని ప్రత్యేక వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా, చైనా నుంచి వచ్చే ప్రయాణికుల్లో ఎవరైనా దగ్గు, జలుబుతో బాధపడుతుంటే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని విమానాశ్రయ వర్గాలను ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారి డాక్టర్ పద్మజ కేస్కర్ తెలిపారు. కరోనా వైరస్ పట్ల ప్రైవేటు వైద్యులు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.
Corona Virus
Mumbai
Airport
China
Hospital

More Telugu News