Paritala Ravi: ఉదాత్త ఆశయాలకోసం పరిటాల రవి జీవితాంతం పోరాడారు: చంద్రబాబు నాయుడు

  • ఆయనొక శక్తి..ఒక వ్యవస్థను నిరసించారు
  • 15 ఏళ్లయినా.. పేదల గుండెల్లో ఆయన చిరంజీవి
  • రవి వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ నేతల నివాళులు
మాజీ మంత్రి పరిటాల రవి జీవించి ఉన్నంతకాలం మంచి ఆశయాలకోసం పోరాడారని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ లో పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు సహా యనమల, అచ్చెన్నాయుడు, రామానాయుడు, దేవినేని ఉమ, కనకమేడల రవీంద్ర కుమార్, కొల్లు రవీంద్ర, జవహర్ తదితర నేతలు నివాళులు అర్పించారు.

కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. పరిటాల రవి మంచి ఆశయాలకోసం జీవితాంతం పోరాడాడని పేర్కొన్నారు. ఒక శక్తిగా ఒక వ్యవస్థను, పెత్తందారీ విధానాన్ని నిరసించారన్నారు. ఆయన చనిపోయి పదిహేనేళ్లయినా పేదల గుండెల్లో చిరంజీవిగా ఉన్నాడని కొనియాడారు. ప్యూడల్ పాలనపై పోరాటమే పరిటాల రవికి అందించే నివాళి అని చంద్రబాబు చెప్పారు. వైసీపీ హత్యా రాజకీయాలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
Paritala Ravi
Death Anniversary
Chandrababu
Andhra Pradesh
Telugudesam

More Telugu News