YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత

  • శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటు
  • అప్పటి నుంచే పార్టీ మారబోతున్నారన్న ప్రచారం
  • భర్త సురేశ్‌తో కలిసి వెళ్లి వైసీపీ కండువా
టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శాసన మండలిలో వైసీపీకి అనుకూలంగా ఓటేసిన సునీత పార్టీ మారబోతున్న ప్రచారం జోరుగా సాగింది. గురువారం ఆ ప్రచారాన్ని సునీత నిజం చేశారు. భర్త సురేశ్‌తో కలిసి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే, ఎమ్మెల్సీ పదవికి మాత్రం ఆమె రాజీనామా చేయలేదు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. అయితే, అదే సమయంలో రాజధాని కోసం అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరినట్టు తెలుస్తోంది.
YSRCP
Telugudesam
MLC
pothula suneetha

More Telugu News