Sai Dharam Tej: హీరో వైష్ణవ్ తేజ్ మూవీ 'ఉప్పెన' ఫస్ట్ లుక్

  • వైష్ణవ్ తేజ్ కు జంటగా నటిస్తోన్న కృతిశెట్టి
  • ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
  • బుచ్చిబాబు దర్శకత్వం.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం

హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెలుగు తెరకి పరిచయమవుతున్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కు జంటగా కృతి శెట్టి నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

More Telugu News