Avasarala: నాగశౌర్యతో అమెరికా వెళ్లనున్న అవసరాల

  • నటుడిగా అవసరాలకి మంచి పేరు
  • దర్శకుడిగా మంచి గుర్తింపు
  • తెరపైకి విభిన్నమైన ప్రేమకథ  

ఒక వైపున నటుడిగా .. మరో వైపున దర్శకుడిగా అవసరాల తన సత్తా చాటుకుంటున్నాడు. ఇటీవల నటనకి కాస్త గ్యాప్ ఇచ్చి దర్శకుడిగా ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఒక వ్యక్తి వివిధ దశల్లో ఒకే అమ్మయితో తన ప్రేమను ఎలా కొనసాగిస్తూ వస్తాడనేది ఈ సినిమా కథాంశం.

కొంత భాగం కథ ఇండియాలో .. మరికొంత భాగం కథ అమెరికాలో నడుస్తుంది. ఇప్పటికే ఇండియా నేపథ్యంలో సాగే సన్నివేశాలను, పాటలను చిత్రీకరించారు. మిగతా భాగం కథను చిత్రీకరించడానికి ఈ సినిమా టీమ్ త్వరలో అమెరికా వెళ్లనుంది. త్వరలోనే ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయనున్నారు. గతంలో అవసరాల తెరకెక్కించిన కథలు ఇటు యూత్ ను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ కొత్త కథ ఎలా వుంటుందో చూడాలి మరి.

More Telugu News