Raana: రానా హీరోగా మరో సినిమా చేయనున్న తేజ?

  • గతంలో రానాతో చేసిన తేజ 
  • 'నేనే రాజు నేనే మంత్రి'తో హిట్ 
  • తదుపరి సినిమాకి సన్నాహాలు 

రానా కథానాయకుడిగా గతంలో వచ్చిన 'నేనేరాజు నేనేమంత్రి' సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా రానా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. చాలా కాలం తరువాత తేజ ఖాతాలో ఒక విజయాన్ని జమ చేసింది. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు ఫిల్మ్ నగర్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

రానా ప్రధాన పాత్రధారిగా తేజ ఒక విభిన్నమైన కథను రెడీ చేసుకున్నాడట. ఈ సినిమాలో రానా పాత్రను చాలా విలక్షణంగా డిజైన్ చేశాడని అంటున్నారు. ఈ సినిమా కోసం ఆయన 'రాక్షస రాజ్యంలో రావణాసురుడు'అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడట. దాదాపు ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం రానా .. 'విరాటపర్వం' సినిమాను పూర్తిచేసే పనిలో వున్నాడు. ఆ తరువాత ఆయన 'హిరణ్యకశిప' చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి తేజ సినిమా ఎప్పుడు చేస్తాడనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.

More Telugu News