Chandrababu: అసెంబ్లీని బాయ్ కాట్ చేద్దాం... చంద్రబాబు అనూహ్య నిర్ణయం!

  • నిన్న మండలి పరిణామాలపై అసంతృప్తి
  • మంత్రులు అప్రజాస్వామికంగా వ్యవహరించారు
  • సభకు వెళ్లవద్దని నిర్ణయం తీసుకున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. నిన్న మండలిలో అధికార పక్ష సభ్యులు ప్రవర్తించిన తీరును తీవ్రంగా నిరసించిన ఆయన, నేటి అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించారు.

 ఈ ఉదయం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన ఆయన, అసెంబ్లీకి హాజరు కావద్దని స్పష్టం చేశారు. నిన్న శాసన మండలిలో మంత్రులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని, పెద్దల సభన్న కనీస గౌరవం లేకుండా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. అందుకు నిరసనగా అసెంబ్లీకి దూరంగా ఉందామని ఆయన చెప్పారు. కాగా, మరికాసేపట్లో ఆయన తుళ్లూరు, మందడం గ్రామాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది.
Chandrababu
AP Assembly Session
Telugudesam
Boycot

More Telugu News