SBI: భారతీయ స్టేట్ బ్యాంకు ఎండీగా చల్లా శ్రీనివాసులు శెట్టి

  • బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులు శెట్టి
  • 1988లో ప్రొబేషనరీ అధికారిగా కెరియర్ ప్రారంభం
  • నిరర్ధక ఆస్తులను పరిష్కరించడంలో కీలక పాత్ర
భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు చేపట్టారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ సర్కిల్‌లో 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన శ్రీనివాసులు శెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. వివిధ హోదాల్లో పనిచేశారు. ఎస్‌బీఐ ఎండీగా బాధ్యతల స్వీకరణకు ముందు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో చమురు, ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఆటో, టెలికం రంగాల్లో నిరర్థక ఆస్తులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించినట్టు ఎస్‌బీఐ తెలిపింది. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు శెట్టి మూడేళ్లపాటు సేవలు అందించనున్నారు.

SBI
Challa Sreenivasulu Setty
MD

More Telugu News