Mahesh Babu: మళ్లీ 'స్పై' పాత్రలో మహేశ్ బాబు

  • వరుస హిట్లతో మహేశ్ బాబు 
  • 27వ సినిమా వంశీ పైడిపల్లితో
  • మే నుంచి రెగ్యులర్ షూటింగ్

'భరత్ అనే నేను'.. 'మహర్షి' .. 'సరిలేరు నీకెవ్వరు'తో హ్యాట్రిక్ హిట్ కొట్టిన మహేశ్ బాబు, తన తదుపరి సినిమాకి సిద్ధమవుతున్నాడు. ఆయన తదుపరి సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నాడు. త్వరలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనీ, 'స్పై' పాత్రను ఆయన పోషించనున్నాడని అంటున్నారు.

గతంలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్పైడర్' సినిమాలో మహేశ్ బాబు 'స్పై'గానే నటించాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా అదే తరహా పాత్రను వంశీ పైడిపల్లి సినిమాలోను మహేశ్ చేయనుండటానికి సిద్ధపడితే నిజంగా అది సాహసమే అవుతుంది. కెరియర్ పరంగా మహేశ్ బాబుకి ఇది 27వ సినిమా .. మే నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారు.

More Telugu News