Railway: రైల్వేస్ కు టికెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.104 కోట్ల ఆదాయం

  • గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 21.33 లక్షల కేసులు
  • ఒక్క డిసెంబర్ లోనే 2.13 లక్షల కేసుల నమోదు
  • 2018తో పోలిస్తే 8.85 శాతం పెరిగిన కేసులు

టికెట్టు లేని ప్రయాణికుల నుంచి రైల్వేకు భారీ ఆదాయం చేకూరుతోంది. మరోపక్క  టికెట్ లేకుండానే ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోందని రైల్వే శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు పశ్చిమ రైల్వే అధికారులు మీడియాకు వివరాలను వెల్లడించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు టికెట్ లేకుండా ప్రయాణించిన వారినుంచి జరిమానాల రూపంలో రూ.104.10 కోట్లు వసూలు చేశామన్నారు.

టికెట్ లేకుండా ప్రయాణించిన వారిపై 21.33 లక్షల కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. 2018తో పోలిస్తే ఈ కేసుల సంఖ్య 8.85 శాతం పెరిగిందన్నారు. మొత్తం 2,124 ప్రదేశాల్లో జరిగిన తనిఖీల్లో 1,821 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఒక్క డిసెంబర్ లోనే 2.13 లక్షల కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వారి నుంచి జరిమానా రూపంలో రూ.10.14 కోట్లు వసూలు చేశామన్నారు.  

  • Loading...

More Telugu News