Darbhar: రూ.200 కోట్ల క్లబ్ లో రజనీ ‘దర్బార్’!

  • రజనీకాంత్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్  
  • తెలుగు రాష్ట్రాల్లో రూ.20 కోట్ల వసూళ్లు 
  • తమిళనాడులో అత్యధికంగా రూ.80కోట్లు  
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్లతో అదరగొడుతూ.. రూ.200 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఈ నెల తొమ్మిదన విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులనుంచి అపూర్వ ఆదరణను చూరగొంటోంది. ఇప్పటి వరకు రజనీకాంత్ నటించిన సినిమాల్లో నాలుగు సినిమాలు మాత్రమే రూ.200 కోట్ల క్లబ్ లో చేరాయి. వాటిల్లో ‘రోబో’ ‘కబాలి’, ‘2.0’, ‘పేట’ ఉన్నాయి. తాజాగా దర్బార్ ఐదో చిత్రంగా రజనీ ఖాతాలో చేరింది.  

దర్బార్ చిత్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.20 కోట్ల వసూళ్లు సాధించగా, తమిళనాడులో రూ.80 కోట్లు, కేరళలో రూ.8 కోట్లు, కర్ణాటకలో రూ.19 కోట్లు, హిందీ వెర్షన్ ద్వారా రూ.8 కోట్లు, విదేశాల్లో రూ.70 కోట్లు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రానికి ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించగా, రజనీ సరసన నయనతార నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో నివేదా థామస్, సునీల్ శెట్టి, యోగిబాబు తదితరులు నటించారు.
Darbhar
Movie
Rs.200crore
Club
India
Tollywood

More Telugu News