Suman: నా వలన భానుచందర్ ఇబ్బంది పడకూడదనుకున్నాను: సీనియర్ హీరో సుమన్

  • నేను జైలుకెళతానని నాకు ముందే తెలుసు 
  • జాతకాలపై మొదటి నుంచి నమ్మకం వుంది 
  • తనని ఎవరూ కావాలని ఇరికించలేదన్న సుమన్
తాజా ఇంటర్వ్యూలో హీరో సుమన్ మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నేను జాతకాలను నమ్ముతాను. ఒక కేసులో చిక్కుకుని జైలుకి వెళతానని నా జాతకంలో వుంది .. అలాగే వెళ్లాను. నేను వెళ్లాను గదా అని నాతో పాటు ఓ పదిమందిని జైలుకి తీసుకెళ్లే తత్వం కాదు నాది.

భానుచందర్ నాకు మంచి మిత్రుడు. నేను తెలుగు చిత్రపరిశ్రమకి రావడానికి ఆయనే కారకుడు. నా వలన అతను ఇబ్బందుల్లో పడకూడదని భావించి, కొంతకాలం వరకూ నన్ను కలవడానికి .. ఫోన్ చేయడానికి ప్రయత్నించవద్దని ఆయనకి ముందుగానే చెప్పాను. దివాకర్ అనే ఒక వ్యక్తి చేసిన పనికి నేను జైలుకి వెళ్లవలసి వచ్చింది. ఆ వ్యక్తికి సినిమా రంగంతో ఎలాంటి సంబంధం లేదు. అలాగే నన్ను ఈ కేసులో ఇరికించడం వెనుక ఒక పెద్ద హీరో ఉన్నాడనే దాంట్లోను నిజం లేదు" అని చెప్పుకొచ్చారు.
Suman
Bhanuchandar

More Telugu News