AP Speaker: స్పీకర్ అధికారాలను కూడా ఏపీ సీఎం లాగేసుకుంటున్నారు : టీడీపీ

  • అసెంబ్లీలో జగన్ రూలింగ్ ఇవ్వడాన్ని తప్పుపట్టిన చినరాజప్ప, జోగేశ్వరరావు 
  • మార్షల్స్ ను రమ్మనడమేంటని ప్రశ్న 
  • సస్పెండ్ చేయకుండా సభ్యులను ఎలా బయటకు పంపిస్తారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్‌కు ఉన్న అధికారాలను కూడా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చేజిక్కించుకుని రూలింగ్ లు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ మండిపడింది. అసెంబ్లీలోకి మార్షల్స్ ను రప్పించి సభ్యులను బయటకు పంపించండి అంటూ సీఎం చేసిన ప్రకటనను వారు తప్పుపట్టారు. 


అసలు అసెంబ్లీలోకి మార్షల్స్ ను స్పీకర్ అనుమతి లేకుండా ఎలా రానిస్తారని ప్రశ్నించారు. సభ్యులను సస్పెండ్ చేయకుండా మార్షల్స్ తో వారిని ఎలా బయటకు పంపిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా సభ జరగడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీ సభ్యులు ఈరోజు వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వీరు స్పందించారు.

AP Speaker
YS Jagan
ruling
marshals

More Telugu News