Balka suman: తెల్లవారితే మున్సిపల్ ఎన్నికలు.. మంచిర్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజీనామా!

  • 6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి లావణ్య
  • చైర్ పర్సన్ గా అవకాశమిస్తామని మాటిచ్చారట
  • తాజాగా వేరే వ్యక్తి పేరు ప్రకటించడంతో లావణ్య మనస్తాపం

తెల్లవారితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మంచిర్యాల మున్సిపాల్టీకి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి సాదనబోయిన లావణ్య తన భర్త కృష్ణతో కలసి పార్టీకి రాజీనామా చేశారు. మంచిర్యాలలోని 6వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థిగా లావణ్య పోటీలో ఉన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా అర్చనా గిల్డా పేరును టీఆర్ఎస్ అధిష్ఠానం తాజాగా ప్రకటించడంపై ఆమె మనస్తాపం చెందినట్టు సమాచారం. చైర్ పర్సన్ అభ్యర్థిగా లావణ్యకు అవకాశమిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆమెకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పోటీ నుంచి తప్పుకున్నట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News