Nani: 'వి' సినిమా నుంచి సుధీర్ బాబు, నాని ఫస్టు లుక్స్ వచ్చేస్తున్నాయ్

  • ఇంద్రగంటి నుంచి రానున్న 'వి'
  • 'రక్షకుడు'గా సుధీర్ బాబు 
  • 'రాక్షసుడు'గా నాని

విభిన్నమైన కథలను ఎంచుకోవడంలోను .. ఆ కథలను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించడంలోను ఇంద్రగంటి మోహనకృష్ణ సిద్ధహస్తుడు. ఆయన తాజా చిత్రంగా 'వి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని .. సుధీర్ బాబు ప్రధానమైన పాత్రలను పోషిస్తుండగా, వారి సరసన నివేదా థామస్ .. అదితీరావు హైదరీ నటిస్తున్నారు.

ఈ సినిమా నుంచి వరుసగా ఫస్టు లుక్స్ వదలడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాత్రల  పరంగా ఈ నెల 27వ తేదీన 'రక్షకుడు' ఫస్టులుక్ ను .. 28వ తేదీన 'రాక్షసుడు' ఫస్టులుక్ ను వదలనున్నట్టు ప్రకటించారు. ఇక 'రక్షకుడు'గా తన ఫస్టులుక్ వస్తుందనే విషయాన్ని సుధీర్ బాబు రివీల్ చేయడంతో, ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపిస్తాడనే ప్రచారం విషయంలోను స్పష్టత వచ్చేసింది.

More Telugu News