Telangana: తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డికి తప్పిన ప్రమాదం!

  • వనపర్తి సమీపంలో ఘటన
  • రహదారిపైకి బర్రె రావడంతో సడన్ బ్రేక్
  • మంత్రి కారును ఢీకొన్న ఎస్కార్ట్ వాహనం
తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. వివరాల్లోకి వెళితే, మునిసిపల్ ఎన్నికల ప్రచారం అనంతరం నిరంజన్ రెడ్డి వనపర్తి నుంచి కొత్తకోటకు బయలుదేరిన సమయంలో జరిగింది.

 ఓ బర్రె రహదారిపై అడ్డుగా రావడంతో, వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయగా, అదుపుతప్పిన ఆ వాహనం, మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో మంత్రి ప్రయాణిస్తున్న వాహనం, దాని వెనుకే వస్తున్న ఎస్కార్ట్ వాహనం ఢీకొనగా, రెండు వాహనాలూ దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆ వెంటనే నిరంజన్ రెడ్డి, తన కాన్వాయ్ లోనే గమ్యానికి చేరుకున్నారని అధికారులు వెల్లడించారు.
Telangana
Niranjan Reddy
Road Accident

More Telugu News