Venkatesh: వెంకటేశ్ కొత్త చిత్రం టైటిల్ గా 'నారప్ప'?

  • అనంతపురంలో జరుగుతున్న షూటింగ్ 
  • నెల రోజులపాటు కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • కథానాయికగా నటిస్తున్న ప్రియమణి  

తమిళంలో ధనుశ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అసురన్' అక్కడ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ధనుశ్ నటనకు ప్రశంసలు దక్కాయి. దాంతో ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ కథానాయకుడిగా ఈ సినిమాను నిర్మించడానికి రంగంలోకి దిగారు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఇటీవలే సెట్స్ పైకి వెళ్లారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను 'అనంతపురం'లో చిత్రీకరిస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఈ సినిమాకి 'నారప్ప'అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే టైటిల్ ను ఖాయం చేస్తారా? లేదా? అనేది చూడాలి. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయనున్నారు.

More Telugu News