Galla Jayadev: జగన్ నిర్ణయం తప్పా? కరెక్టా? అనేది ఇండియా టీవీ సర్వే స్పష్టం చేసింది: కేశినేని నాని

  • మూడు రాజధానుల అంశం తప్పని ఇండియా టీవీ సర్వేలో తేలింది
  • మెజర్టీ ప్రజలు జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు
  • గల్లా జయదేవ్ ను వెంటనే విడుదల చేయాలి

ఏపీకి మూడు రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ నిన్న ఆమోదముద్ర వేసింది. టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేసిన వేళ, టీడీపీ అధినేత చంద్రబాబు వాకౌట్ చేసిన వేళ, సభలో కేవలం వైసీపీ సభ్యులు మాత్రమే ఉన్న వేళ... ఈ బిల్లు సభ ఆమోదం పొందింది.

ఈ నేపథ్యంలో, టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ ద్వారా ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. సీఎం జగన్, ఆయన గ్యాంగ్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం తప్పు అని ఇండియా టీవీ నిర్వహించిన సర్వే స్పష్టం చేసిందని చెప్పారు. 67 శాతం మంది జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు. దీంతో పాటు ఇండియా టీవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వివరాలను షేర్ చేశారు.

మరోవైపు, తమ ఎంపీ గల్లా జయదేవ్ ను అరెస్ట్ చేయడాన్ని కేశినేని ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షలో భాగంగా చేశారని మండిపడ్డారు. జయదేవ్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News