Allu Arjun: మెగా పవర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే: రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు

  • అల్లు రామలింగయ్యకు నిజమైన వారసుడు
  • మెగా ఫ్యాన్స్ ను మెప్పించే హీరో బన్నీయే
  • ట్విట్టర్ లో వర్మ
మెగా కుటుంబంలో పవర్ స్టార్ అంటే అల్లు అర్జున్ మాత్రమేనని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, అల్లు రామలింగయ్యకు నిజమైన వారసుడిని తానేనని అల్లు అర్జున్ నిరూపించుకున్నారని అభిప్రాయపడ్డారు. ఇకపై అల్లు అర్జున్ మాత్రమే నిజమైన మెగా పవర్ స్టార్ అని వ్యాఖ్యానించారు. ఓ సూపర్ స్టార్ గా, మెగా ఫ్యాన్స్ ను మెప్పించే హీరోగా నిలిచింది బన్నీ మాత్రమేనన్నారు. కాగా, చిరంజీవి అభిమానులు మెగా పవర్ స్టార్ అన్న ట్యాగ్ ను రామ్ చరణ్ కు ఇచ్చిన నేపథ్యంలో వర్మ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Allu Arjun
Ramgopal Varma
Twitter
Mega Power Star

More Telugu News