udhav thakre: విమర్శలతో వెనక్కి తగ్గిన ఉద్ధవ్ ప్రభుత్వం.. సాయిబాబా జన్మస్థలంపై ప్రకటన వెనక్కి!

  • ట్రస్ట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్, అజిత్ పవార్ సమావేశం
  • శిరిడీ సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని పేర్కొనరాదని నిర్ణయం
  • చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసిన ట్రస్ట్ సభ్యులు

శిరిడీ సాయిబాబా జన్మస్థలం విషయంలో తలెత్తిన వివాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇకపై సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని పేర్కొనబోమని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది. శిరిడీ ట్రస్టు ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నిన్న సమావేశమయ్యారు. సాయి జన్మస్థలంపై తాను చేసిన ప్రకటనను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఉపసంహరించుకున్నారు.

అనంతరం శివసేన నేత కమలాకర్ కోతే మీడియాతో మాట్లాడారు. శిరిడీ సాయిబాబా జన్మస్థలంగా పథ్రిని ఇకపై పేర్కొనరాదని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో కొత్త వివాదాలకు చోటు లేదని, ఇక ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడినట్టేనని స్పష్టం చేశారు. సీఎంతో చర్చలపై సంతృప్తి చెందినట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు.

More Telugu News