Ranji Trophy: రంజీలో.. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టిన మనోజ్ తివారీ

  • 414 బంతుల్లో 303 పరుగులు చేసి నాటౌట్
  • పశ్చిమ బెంగాల్ తో తలపడుతున్న హైదరాబాద్
  • బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 635/7 డిక్లేర్
  • హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 83/5 బ్యాటింగ్..

రంజీ ట్రోఫీ మ్యాచ్ లో బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ త్రిశతకంతో అదరగొట్టాడు. 414 బంతులు ఎదుర్కొన్న తివారీ 303 పరుగులు చేయడమేకాక నాటౌట్ గా నిలిచాడు. తివారీ ఇన్నింగ్స్ లో 30 బౌండరీలు, 5 సిక్సర్లున్నాయి. పశ్చిమబెంగాల్ లోని బెంగాల్ క్రికెట్ మైదానం వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్ లో పశ్చిమబెంగాల్ జట్టు హైదరాబాద్ జట్టుతో తలపడుతోంది. నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బెంగాల్ జట్టు ఈ రోజు కూడా బ్యాటింగ్ చేసి ఏడు వికెట్లకు 635 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.

నాలుగో బ్యాట్స్ మన్ గా క్రీజులోకి వచ్చిన తివారీ నిన్న సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ రోజు రెండో ఆటలో మరో రెండు సెంచరీలు చేసి త్రిశతకం పూర్తి చేసుకున్నాడు. మనోజ్ తివారీ భారత జట్టు తరపున 12 వన్డేలు, మూడు టీ20 లు ఆడాడు. చివరిసారిగా జింబాబ్వేలో మన దేశం తరఫున ఆడాడు.    

అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ వెంట వెంటనే వికెట్లు కోల్పోయి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. జవీద్ అలీ 19 పరుగులతో, తన్మయ్ అగర్వాల్ 10 పరుగులతో ఆడుతున్నారు. బెంగాల్ జట్టు కంటే హైదరాబాద్ ఇంకా 552 పరుగులు వెనకబడి ఉంది.

More Telugu News