Australia: ఆస్ట్రేలియాలో మరో ప్రకృతి విపత్తు.. విరుచుకు పడ్డ ఇసుక తుపాను!

  • మరోపక్క భారీ వర్షాలు, వడగళ్ల వానలు
  • తుపాను హెచ్చరికలను జారీ చేసిన వాతావరణ శాఖ
  • కాన్ బెర్రాలో గోల్ఫ్ బంతుల పరిమాణంలో వడగళ్లు 

ప్రకృతి విపత్తులతో ఆస్ట్రేలియా సతమతమవుతోంది. ఇటీవల ఆ దేశం అడవుల్లో చెలరేగిన కార్చిచ్చులు సస్యశ్యామలమైన పచ్చదనాన్ని చాలాభాగం వరకు తుడిచిపెట్టాయి. తాజాగా ఆ దేశాన్ని ఇసుక తుపాను, మరో పక్క వడగళ్ల వాన చుట్టుముట్టాయి. దక్షిణ ఆస్ట్రేలియాలోని ప్రాంతాలను భారీ స్థాయిలో దుమ్ముతో కూడిన మేఘాలు కప్పివేయగా, పెద్దపెద్ద మంచు రాళ్లతో కూడిన వర్షం సంభవించింది.

ఇసుక తుపాన్ మూలంగా న్యూ సౌత్ వేల్స్ టౌన్ ఒక్కసారిగా చీకటిగా మారింది. దుమ్ము దుప్పటిలా పరుచుకుంది. క్వీన్స్ లాండ్, విక్టోరియా, న్యూసౌత్ వేల్స్, దేశ రాజధాని కాన్ బెర్రాలో తీవ్ర తుపాను హెచ్చరికలను  అక్కడి వాతావరణ శాఖ జారీచేసింది. కాన్ బెర్రా లోని పార్లమెంట్ భవనంలో గోల్ఫ్ బంతుల పరిమాణంలో వడగండ్లు పడ్డాయని తెలుస్తోంది. స్థానికులు ఈ ఇసుక తుపాన్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మీరు కూడా వాటిని చూడచ్చు.


More Telugu News