ఎన్నికల్లో పంచే డబ్బులు మనవే!: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్
- కరీంనగర్ జిల్లాలో రోడ్ షో
- ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండని సూచన
- ఓటు మాత్రం టీఆర్ఎస్ కే వేయాలన్న గంగుల
ఎన్నికల్లో పంచే డబ్బులు మనవే అని చెప్పారు. డబ్బులను కాదనకుండా తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. పోటీచేస్తున్న నాయకులను పిలిచి.. ఓటుకు రెండు వేలు అడిగి తీసుకోవాలని ఓటర్లను గంగుల కోరారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు.