అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కు.. అశాంతి కావాలంటే ఎంఐఎం, బీజేపీలకు ఓటేయండి: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కు.. అశాంతి కావాలంటే ఎంఐఎం, బీజేపీలకు ఓటేయండి: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి

  • ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎంకు మేయర్ పదవి ఇవ్వం
  • తమ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఊపందుకుంది
  • ఎంఐఎంతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు
తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక అభివృద్ధి ఊపందుకుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి మీడియాతో మాట్లాడారు. నిజామాబాద్ లో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమన్నారు. రోడ్లు, భూగర్భ మురుగు నీటి పారుదల సౌకర్యం, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, పార్కులు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు.

మేయర్ సీటు ఇచ్చేందుకు ఎంఐఎంతో టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుందంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఐఎంకు మేయర్ స్థానం ఇవ్వమని తేల్చి చెప్పారు. అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ కు, అశాంతి కావాలంటే ఎంఐఎం, బీజేపీలకు ఓటేయాలని చెప్పారు. ప్రతిపక్షాల ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.
Telangana
TRS
Minister
Prashanth Reddy
Nizamabad District

More Telugu News