Andhra Pradesh: సభలో సీఎం జగన్ పక్కన కూర్చుని ఆసక్తి రేకెత్తించిన రాపాక
- ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు
- సభలో జగన్ తో చర్చిస్తూ కనిపించిన రాపాక
- ఇటీవల రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న రాపాక చర్యలు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదటి రోజు సమావేశం సందర్భంగా సభలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నేరుగా వెళ్లి సీఎం జగన్ పక్కనే కూర్చున్నారు. ఆయనతో కాసేపు ఏదో విషయమై తీవ్రంగా చర్చించారు.
అనంతరం తన పూర్వ స్థానంలో కూర్చున్నారు. రాపాక చర్య అందరి దృష్టినీ ఆకర్షించింది. కాగా, రాపాక కొన్నాళ్లుగా వైసీపీ అనుకూల వైఖరి కనబరుస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతు పలకడమే కాదు, జగన్ ఫొటోలకు పాలాభిషేకం చేయడం వంటి చర్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యారు.