Sailajanath: జగన్ నిర్ణయం ప్రతీకార చర్యగా ఉంది: శైలజానాథ్

  • ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు
  • రాష్ట్రంలో పాలనే లేదు
  • అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది

రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం దురదృష్టకరమని ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం ఒక వ్యక్తిపై ప్రతీకార చర్యగా ఉందని చెప్పారు. అమరావతిని నాలుగేళ్ల క్రితమే జగన్ సమర్థించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పాలన లేదని... అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. అభివృద్ధి వికేంద్రీకరణకు ఎవరైనా ఒప్పుకుంటారని... కానీ, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ప్రాంతాల మధ్య జగన్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News