Botsa Satyanarayana Satyanarayana: సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు: అచ్చెన్నాయుడుపై బొత్స ఆగ్రహం

  • మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదంటూ వ్యాఖ్య
  • టీడీపీ సభ్యులు గౌరవంగా మాట్లాడాలంటూ హితవు 
  • వాళ్లలా తాము హత్యలు చేసి అసెంబ్లీకి రాలేదన్న బొత్స 
రాజధాని, ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. విశాఖ రాజధానిగా కావాలని ఎవరడిగారిని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు అయి ఉండి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదని విమర్శించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని అన్నారు. స్పీకర్ గురించి కూడా విపక్ష సభ్యులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని... గౌరవంగా మాట్లాడాలంటూ మండిపడ్డారు. టీడీపీ వాళ్లలా హత్యలు చేసి తాము అసెంబ్లీకి రాలేదని చెప్పారు.
Botsa Satyanarayana Satyanarayana
Kinjarapu Acchamnaidu
AP Assembly Session
Telugudesam
YSRCP

More Telugu News